Tuesday, 21 August 2012

మహా మాయ


అవును, మన మంతా మాయలో జీవిస్తున్నాము. దైవం మనిషికి మనసు, అహంకారం,  బుద్ధి, జ్ఞానం వంటి వాటితో పాటు మాయను కుడా ఇచ్చాడు. 

మాయ చాల పెద్ద పదం, నిత్య జీవితంలో మన " భ్రమల" గురించి మాటలాడు కుందాము.

బాల్యంలో ఆట వస్తువుల  పట్ల "భ్రమ "  
తర్వాత చాకలెట్లు, బిస్కట్లు, ఐష్ క్రీంలు, చిరు తిండ్ల పట్ల  "భ్రమ " 
పాటశాల రోజుల్లో మంచి  ఉద్యోగం పట్ల  "భ్రమ " తో చదువులతో అష్టకష్టాలు 
సినిమాలు, సీరియల్లు, హీరోలు, హిరోయిండ్ల పట్ల  "భ్రమ " 
ఉద్యోగం/ వృత్తి/ వ్యాపారాలలో మరింత సంపాదన పట్ల  "భ్రమ " 
సంపాదన, పరపతి, హోదాలతో బంధు మిత్రాదుల పట్ల  "భ్రమ " 
వయసులో వివాహం పట్ల/ భాగస్వామి పట్ల  "భ్రమ " 
తర్వాత మన పిల్లలు, సంసారం, భాద్యతల పట్ల  "భ్రమ " 
మన ఆరోగ్యం, శక్తి, సామర్థ్యాల పట్ల  "భ్రమ "   
సమస్యలు  వచ్చినప్పుడు అనేక దేవుళ్ళ పట్ల అపారమైన భక్తి, విశ్వాసాలు.
సమస్యలు తీరక పోతే/ తగ్గక పోతే జ్యోతిష్యం, వాస్తు, వంటి వాటి పట్ల  "భ్రమ " 

ఇలా బాల్యం నుంచి ఒక దశ నుంచి మరొక దశకు మారుతున్నప్పుడల్లా మన  "భ్రమ " లలో కుడా మార్పులు వస్తున్నాయి, అయినా ఏ దశలో భ్రమలను ఆ దశలో నిజాలని నమ్ముతున్నాము. మనమున్న దశ కంటే "అనుభవం" తో ముందున్న పెద్దలు, శ్రేయోభిలాషులు కాస్తా జాగ్రత, సలహా, వంటివి చెప్పినా మనం వినము. 

ఈ జీవితమే అంతా కాదు, గత జన్మలు వున్నాయి, మళ్లీ  జన్మలు వున్నాయి కాస్త ఆధ్యాత్మికతను అలవర్చుకోండి , పాపపుణ్యాలు పట్టించుకోండి అని ఎందరో ఋషులు, మునులు, యోగులు, మహనీయులు చెప్పినా  మనకు అవి ఆలకించి, ఆచరిచడానికి తీరిక ఎక్కడిది? ఎప్పుడు ఉంటామో, ఎప్పుడు పోతామో తెలియని ఈ జీవితం పట్ల అనేక భ్రమలు! 

యక్ష ప్రశ్నల్లో ఈ ప్రపంచంలో వింత ఏమిటని అడిగితే ధర్మ రాజు చెప్పిన సమాధానం " తన ముందే ఎందరో లోకం విడిచి పోతున్నా తను మాత్రం శాస్వితుడనని మనిషి విస్వశించడమే ", ఈ జవాబు లోతుపాతులను ఆలోచించండి.


మరిన్ని వివరాలతో కలుస్తాను.
మీకందరికీ ఆరోగ్యము,  సంతోషం, ప్రశాంతత & దివ్యానందం  చేకూరాలని ఆశిస్తూ.
డాక్టర్ ఆర్. యస్. ఈశ్వర్ రెడ్డి  






No comments:

Post a Comment